మంచిర్యాల జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి విడుదలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులను ప్రాజెక్టు పరిసరాల్లోని తీసుకురావద్దని, చేపలు పట్టేవారు రావద్దని సూచించారు.