సీపీఎం పార్టీ చెన్నూర్ పట్టణ నాయకురాలు స్వర్గం పోషమ్మ శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన నివాసంలో కన్నుమూశారు. పలువురు సిపిఎం నాయకులు పోషమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. గత 15 ఏళ్లుగా తన ఇంటిని పార్టీ కార్యక్రమాలకు కేంద్రంగా మార్చి ఎన్నో పోరాటాలు చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ అశయ్య కొనియాడారు.