మహిళను కాపాడిన పోలీసులు

84பார்த்தது
పాత మంచిర్యాలకు చెందిన ఆకుతోట లక్ష్మి అనే మహిళ శనివారం మధ్యాహ్నం రాళ్లవాగు బ్రిడ్జిపై ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుండగా పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను గమనించిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్స్ సత్యం, ప్రదీప్, హోంగార్డ్ సంపత్ ఆమెను రక్షించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ బన్సీలాల్ బ్లూ కోల్ట్ సిబ్బందిని అభినందించి వారికి రివార్డ్ అందజేశారు.

தொடர்புடைய செய்தி