చర్ల: నాటు సారాపై సమరం
చర్ల మండల పరిధిలోని లింగాపురంపాడులో యువత శుక్రవారం నాటు సారాపై సమరమే చేశారు. గ్రామంలో సారా అమ్ముతున్నారని అధికారులకు తెలిపినా పట్టించుకోక పోవడంపై ఆగ్రహంతో స్థానిక యువకులే దాడులు చేశారు. ఇక నుంచి గ్రామంలో సారా అమ్మితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విచ్చల విడిగా అమ్ముతున్న సారాతో కుటుంబాల్లో గొడవలు నెలకొని అశాంతి ఏర్పడుతోందని దీంతో సారా కట్టడికి చర్యలు చేపట్టినట్లు యువకులు వివరించారు.