అటవీ శాఖలో ఏళ్ల తరబడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని చండ్రుగొండకు చెందిన అటవీ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం బాధ్యులు రాష్ట్ర అటవీ అభివృద్ధి ఛైర్మన్ పొదెం వీరయ్యకు వినతిని భద్రాచలం అయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. గత ప్రభుత్వంలో కొంతమంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించారని వారిని కూడా విధులు నిర్వర్తించేలా చొరవ చూపాలన్నారు.