భద్రాద్రి: కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
భద్రాద్రి: కలెక్టర్ కార్యాలయం నందు శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పథకాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పిఓ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో మెడికల్, రోడ్లు, విద్య, అంగన్వాడి, బ్రిడ్జిలు, విద్యుత్, మున్సిపాలిటీ, రైల్వే ఇలా అనేకమైన సమస్యలపై ప్రభుత్వ అధికారులతో చర్చించారు.