ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు అటానమస్ హోదా
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్ కమిటీ టీం సందర్శించింది. కళాశాలకు అటానమస్ హోదాను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పాటు గిరిజన ప్రాంతంలో సేవలందిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. జాతీయ స్థాయిలో న్యాక్ బి ప్లస్ ప్లస్ సాధించిన కళాశాలకు నేడు అటానమస్ హోదా లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.