చర్ల సరిహద్దు ప్రాంతామైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో 12 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించినట్లు భస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మృతుల్లో ఇంకా 9 మంది మృతదేహాలు గుర్తించాల్సి ఉందని అన్నారు. వీటి కోసం ఇరు రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు ఫోటోలను పంపించినట్లు తెలిపారు.