కందుకూరు: ఉదయం కేక్ కటింగ్ సాయంత్రం అభివృద్ది కమిటీ అంటే ఎలా
కందుకూరు టిడిపి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పత్రిక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కమిటీకి తాను వ్యతిరేకం కాదని ప్రజలకు మంచి చేయటానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని, కానీ ఉదయం వైసీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ లు సాయంత్రం అభివృద్ధి కమిటీ అంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలలో తనమీద లేనిపోని అపోహలను సృష్టించవద్దని అభివృద్ధి కమిటీకి సూచించారు.