హైదరాబాద్‌లోని చిక్కడపల్లి PSలో నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయవాదుల సమక్షంలో పోలీసులు ప్రశ్నలు సంధించగా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఏసీపీ రమేశ్, ఇన్స్‌పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సుమారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించగా.. తప్పకుండా సహకరిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.