ఉలవపాడు మండలం రామాయపట్నం తీర ప్రాంతంలో శనివారం సాయంత్రం కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పర్యటించారు. రామాయపట్నం ప్రాంతాల్లో పర్యటించి తుఫాను ప్రభావం వలన తీవ్ర గాలులు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన దృష్ట్యా పశువుల కాపరులు పొలాల్లో పనిచేసే రైతులు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు వేటకు వెళ్లరాదని సూచించారు.