గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుడ్లూరు మండలం క్లస్టర్ ఇంచార్జ్ ఉమ్మడిపోలు కోటేశ్వరరావు అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పాజర్ల గ్రామానికి వెళ్లి ఆయన కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన పార్థివదేహం పై కప్పి కోటేశ్వరరావు కి నివాళులర్పించారు. కోటేశ్వరరావు మృతి పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు.