మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పని చేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మంగళవారం టీఎన్జీవోస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.