కందుకూరు వ్యాప్తంగా దట్టంగా పొగ మంచు
కందుకూరు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి భారీగా పొగ మంచు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతంగా చలి తీవ్రత ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. తెల్లవారుజామునే కూలీలు ట్రాక్టర్లు, ఆటోలలో పనులకు వెళ్తుంటారు. దట్టంగా మంచు కమ్ముకొని ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.