రాళ్లపాడు ప్రాజెక్టు గేట్ మరమ్మత్తు పనులను బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఇది ఇలా ఉంటే మంగళవారం రాత్రి 1 గంట సమయంలో కందుకూరు ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి తెల్లారే వరకు ఉన్నారు. ఎమ్మెల్యేలు సైతం ఇంత కష్టపడాల్సిన పని ఏంటంటే ఆ ప్రాజెక్టు కింద 16 వేల ఆయకట్టు ఉంది. ఈ ప్రాంత ప్రజలకు రాళ్లపాడు వరప్రసాదిని.