కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలపనందుకు నిరసనగా ఈనెల 23వ తేదీన కందుకూరులో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు తెలిపారు. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరును వైసీపీ నెల్లూరు జిల్లాలో విలీనం చేశారని,, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రకాశంలో కలుపుతామని చెప్పినప్పటికీ 6 నెలలు అవుతున్న విలీన ప్రక్రియ చేయనందుకు నిరసన చేపట్టనున్నారు.