నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ పదవి తనకు రావడానికి పూర్తిస్థాయిలో సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కు గుర్రం మాల్యాద్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కందుకూరు లోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. మాల్యాద్రి మాట్లాడుతూ తనపై ఎమ్మెల్యేకు ఉన్న ప్రేమకు నిదర్శనమే ఈ పదవి అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ గుర్రం మాల్యాద్రి తనకు నమ్మకస్తుడైన ఆప్త మిత్రుడన్నారు.