గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలు వారం రోజులుగా చేస్తున్న సమ్మెకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్, ఉపాధ్యక్షుడు బండి రమేష్ మద్దతు తెలిపారు. మంగళవారం ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిర్వహించిన సీఆర్టీల ధర్నాలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఆర్టీలకు మినిమం టైం స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.