తండ్రి పై కత్తితో కుమారుడి దాడి... పరిస్థితి విషమం
దొనకొండ మండలం రుద్ర సముద్రం గ్రామంలో తండ్రి పై కుమారుడు కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన వీరయ్య చౌదరికు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా పెద్ద కుమారుడితో తండ్రికు గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం గ్రామంలో నడిచి వెళుతున్న తండ్రి పై కత్తితో దాడి చేయడంతో తల పై తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు మార్కాపురం లోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు కు తరలించారు.