త్వరలో టీడీపీ గూటికి మాజీ మంత్రి.?
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడలో ఆయన సీఎం చంద్రబాబును కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తన సోదరులతో సీఎం నును కలిసిన శిద్దా వరద బాధితులకు విరాళం ఇచ్చారు. ఇప్పుడు టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇంతకీ, వీరు పార్టీలో చేరనున్నారా లేదా అనేది నిజానిజాలు తెలియాల్సి ఉంది.