ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ఆ పదవిలో ఉండనని ఆప్ కార్యకర్తలతో భేటీలో వెల్లడించారు. నవంబర్‌లో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని, తాను అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి వీధికి, ఇంటికి వెళ్లి తాను నిర్దేషినైతేనే ఓట్లేయాలని ప్రజలను అడుగుతానన్నారు.