ప్రత్తిపాడులో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండల కేంద్రంలో శనివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వలన కుండపోత వర్షం కురిసింది. మసీదు సెంటర్, గుంటూరు రోడ్డు, బీసీ కాలనీలలో రోడ్లు జలమయమయ్యాయి. వర్ష ప్రభావం వలన గంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అకాలవర్షంతో మెట్ట ప్రాంత పైరులకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాడు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.