హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని ఈ నెల 17న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి మోదీతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.