గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేని గుంట పాలెం గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కూటమి శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.