కాకుమాను గ్రామంలో శుక్రవారం నిత్యవసర ధరల నియంత్రణలో భాగంగా పౌరసరఫరా శాఖ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల తహసిల్దార్ వెంకటస్వామి ప్రత్యేక కౌంటర్ ద్వారా వంట నూనెలు విక్రయాలను ప్రారంభించారు. స్థానిక జిడిసిసి బ్యాంక్ ప్రక్కన కౌంటర్లో తక్కువ ధరలకు వంటనూనెలు వినియోగదారులు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.