
జగిత్యాల: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక అనారోగ్యంతో రైతు ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామానికి చెందిన దుబ్బాక చంద్రయ్య (50) అనే రైతు అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందులు తాళలేక జీవితం మీద విరక్తితో బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటి వెనకాల గదిలో తలపు గడియ వేసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలుతెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తము జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.