24 నుండి బుగ్గారంలో మహా శివరాత్రి జాతర

71பார்த்தது
జగిత్యాల జిల్లా బుగ్గారంలోని శ్రీ సాంబ శివ నాగేశ్వర ఆలయంలో ఈనెల 24 నుండి 27 వరకు మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడునని ఆలయ కమిటి చైర్మన్ మసర్తి రాజిరెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో శివ దీక్షా స్వాముల చేతుల మీదుగా ఆహ్వాన పత్రిక, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, శివదీక్షా స్వాములు కటుకూరి అంజయ్య, పెద్దన వేణి రాగన్న, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி