కొండగట్టు అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు అభివృద్దిని కొనసాగించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.