జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్‌లో ఓ ముగజీవి సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి ఆచేతన స్థితిలో పడి ఉన్న ఆవును స్థానికులు కాపాడి మానవత్వం చాటుకున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని కాలు విరిగి రోడ్డుపై పడిపోయింది. ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు, విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ యువకులు భారీ క్రేన్ సాయంతో వాహనంలో ఎక్కించి ఆవును కాపాడి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.