జగిత్యాల: వేంపల్లి చెరువులో మొసలి ప్రత్యక్షం (వీడియో)

67பார்த்தது
మల్లాపూర్ మండలం వేంపల్లి చెరువులో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వేంపల్లి శివారులోని తాళ్లచెరువులో అటుగా వెళ్తున్న రైతులకు మొసలి ఒడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో వారు భయాందోళనలకు గురయ్యారు. గత నాలుగు రోజులు చెరువు పరిసరాల్లోనే మొసలి ఉన్నట్లు తెలిపారు. మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

தொடர்புடைய செய்தி