హైదరాబాద్ కు చెందిన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ అధినేత మహేశ్వర్ రెడ్డి జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారికి 350 గ్రాములు బంగారం, 48 కేజీల 500 గ్రాముల వెండితో మకర తోరణం అలంకరణ తొడుగులను సోమవారం బహుకరించారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి స్వామివారి మూలవిరాట్ కు కిరీటాన్ని తొడిగి అమర్చారు.