
జగిత్యాల: ఈత చెట్టుపై నుండి జారిపడి గీత కార్మికుని మృతి
జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి లచ్చయ్య (54) సోమవారం ప్రమాదవశాత్తు గ్రామ శివార్లలోని ఈత చెట్టుపై నుండి జారిపడి మృతి చెందాడు. మృతుడి భార్య దాసరి మల్లమ్మ పిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.