జగిత్యాల జిల్లా కేంద్రంలోని విజయపురి సమీపంలోని హన్మకొండ డిటిసి పుప్పాల శ్రీనివాస్ బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. డీటీసీపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బంధువులు, సన్నిహితుల ఇండ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కరీంనగర్ ఏసీబీ, డీఎస్పీ రమణ మూర్తి తన సిబ్బందితో కలిసి జగిత్యాలలో సోదాలు చేస్తున్నారు.