ఆన్ లైన్ లో మాత్రమే సభ్యత్వం చేయించాలి
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ లో బీజేపీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రతి ఒక్కరితో పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని కోరారు. ఆన్ లైన్ లో మాత్రమే సభ్యత్వం చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ సేకరణ ఇన్చార్జి లక్ష్మీ నరసయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.