సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు
ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్ బండ్ పరిసరాల్లో సోమవారం పోలీసులు భారీగా మోహరించారు. నగరం అంతటా 163(144) సెక్షన్ అమల్లో ఉంది. ఓ వైపు ఏక్ పోలీస్, ఏక్ స్టేట్ అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగుడవద్దని పోలీసులు సెక్షన్ 163 అమలు చేశారు. దీంతో నగరం అంతటా హై టెన్షన్ నెలకొంది