హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా ర్యాలీ
హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా ఆదివారం హిందూ వాహిని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో బాలానగర్ డివిజన్ పరిధిలో భారీ ర్యాలీని నిర్వహించారు. హిందూ వాహిని కార్యకర్త శ్రీశైలం నేతృత్వంలో బాలానగర్ ప్రధాన రహదారిపై ఈ ర్యాలీ కొనసాగింది. అల్లరి మూకలకు తగిన శిక్ష జరిగితేనే ఇలాంటివి మరల పునరావృతం కావని నినాదాలు చేశారు.