నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలి: కార్పొరేటర్ దొడ్ల
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీలో రోడ్ నెంబర్ 4 వద్ద 17 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా తగిన ఏర్పాట్లను చేసి ప్రజలకు త్వరగా రోడ్డును అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు.