
కూకట్ పల్లిలో యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి హర్షిత పీజీ బాయ్స్ హాస్టల్ లో సోమవారం యూ మహేందర్ అనే యువకుడు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్ది కాలంగా అడ్డగుట్టలోని సాయి హర్షిత బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న మహేందర్ తన ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించారు.