సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల సమయం కావున జిల్లా వ్యాప్తంగా పీహెచ్ సీలతో పాటు పల్లెదవాఖానాల్లో తేలుకాటు, పాముకాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.