ఏపీలో భారీ వర్షాలు, వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖపై సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 4 వేల కి.మీ.పైగా రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పగా.. ప్రాధాన్యతల వారీగా వాటిని బాగు చేయాలని సూచించారు. అలాగే వరద నష్టం అంచనాలను వేగంగా సిద్ధం చేయాలన్నారు.