నాగార్జునసాగర్: సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం నాలుగు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 95, 469 క్యూసెక్కులు ఉంది. ఇక జలాశయంలో 590 అడుగుల నీటిమట్టం, 312. 045 టీఎంసీల నీటి నిల్వ ఉంది.