
నిడమనూరు: శ్రీ నాగ శంభులింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి సహకరించండి
నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్ శివాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12: 30 వరకు శ్రీ నాగ శంభులింగేశ్వర స్వామికి ఎవరైనా దంపతులు స్వయంగా అభిషేకం, అర్చనలు చేయవచ్చని దేవస్థానం చైర్మన్ పిల్లి నాగేష్ యాదవ్ శుక్రవారం తెలిపారు. దేవాలయానికి దాతలు ఎవరైనా సహకరించగలరని పిల్లి నాగేష్ యాదవ్ కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8106602717.