గుండెపోటుతో రైతు మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామానికి చెందిన బుగుడాల సిద్ధప్ప ఆదివారం గుండె పోటు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. నిరుపేద రైతు కుటుంబం కావడంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో బంధువుల రోధనలు అందరిని కలచివేశాయి. మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్థులు కోరారు.