జూలూరుపాడు: గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు అందక కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ గోరు బంజారా పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. తక్షణమే కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించి, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతూ, శనివారం ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు.