కొత్తగూడెం: సుజాత నగర్ మండలం డేగలమడుగు గ్రామంలో జిన్నింగ్ మిల్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు శనివారం ప్రారంభించారు. పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని రైతులకు అవగాహన కల్పిస్తూ.. సీసీకి వచ్చిన రైతులు తిరిగి వెళ్లకుండా దళారుల బారిన పడకుండా చూడవలసిన బాధ్యత మార్కెట్ కమిటీ వారిదేనని శాసనసభ్యులు కూనంనేని అన్నారు.