కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ చిన్నబంగారుజాల గుడిపాడు, తదితర కాలనీల్లో 2. 28 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతగా చేపట్టాలని గుత్తేదారులను ఆదేశించారు. జంట పట్టణాలను కార్పొరేషన్గా ఏర్పాటు చేయడంతో పాటు రింగ్ రోడ్డు ప్రతిపాదనను అనుమతి రానున్నట్లు చెప్పారు.