
మన్మోహన్ సింగ్ కు కొత్తగూడెం బార్ కౌన్సిల్ నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ హాలులో మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సంతాపాన్ని తెలిపారు. దేశ ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు.