బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల గాంధీనగర్లో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని హెల్త్ సెంటర్ గా మార్చాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. బుధవారం నాయకులు స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే నిరుపయోగంగా ఉన్న భవనాన్ని హెల్త్ సెంటర్ గా మార్చేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.