ప్రకృతి దైవంతో సమానమని, పర్యావరణాన్ని సంరక్షించటం అందరి బాధ్యత అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జిల్లా అధికారులు, ప్రముఖులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి, నిరుపేద గిరిజనులకు అందేందుకు, తద్వారా మెరుగైన జీవితాలను అందించేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.