పినపాక మండలం, నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. 3లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.